ఉత్తరకొరియా సరిహద్దులో భారీగా భద్రతను పెంచుతోన్న చైనా.. రేడియేషన్ గుర్తించే పరికరాలు సైతం సిద్ధం
- ఉత్తరకొరియా, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు
- ఉత్తరకొరియా, చైనా మధ్య 1,420 కిలోమీటర్ల మేర సరిహద్దు
- యుద్ధం జరిగితే తమకు నష్టం జరగకుండా చైనా చర్యలు
- సరిహద్దుల్లో సీసీ కెమెరాలు కూడా
అంతేకాదు, ఒకవేళ యుద్ధ పరిస్థితుల్లో ఉత్తరకొరియా నుంచి శరణార్థులు తరలివస్తే తీసుకోవాల్సిన చర్యలపై కూడా చైనా యోచిస్తోంది. ఇప్పటికే సరిహద్దుల్లో భద్రతను భారీగా పెంచడమే కాకుండా, సరిహద్దు వెంబడి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసింది. అణు పరీక్షల ద్వారా వెలువడే రేడియేషన్‌ను గుర్తించే పరికరాలను సిద్ధం చేసింది. ఉత్తరకొరియా ప్రజలతో సన్నిహితంగా ఉండకూడదని చైనా తమ ప్రజలకు చెబుతోంది.