ab devilliers: సిరీస్ కోల్పోయిన టీమిండియాపై డీవిలియర్స్ ప్రశంసలు!

  • టీమిండియా బాగానే ఆడింది
  • ముఖ్యంగా పేసర్ల ప్రదర్శన సూపర్బ్
  • టెస్ట్ మ్యాచ్ లు ఎప్పటికీ సవాలే
దక్షిణాఫ్రికాతో వరుసగా రెండు టెస్టులను కోల్పోయిన టీమిండియా ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను కోల్పోయింది. సఫారీ గడ్డపై మన ప్లేయర్ల ఆటతీరు పట్ల ఓ వైపు విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో... దక్షిణాఫ్రికా ఆటగాడు డీవిలియర్స్ మాత్రం ప్రశంసలు కురిపించాడు. వాస్తవానికి భారత్ మెరుగైన ప్రదర్శన చేసిందని చెప్పాడు.

ముఖ్యంగా టీమిండియా పేస్ బౌలింగ్ తమను ఎంతో ఆశ్చర్యంలో ముంచెత్తిందని అన్నాడు. తాము ఊహించిన దానికంటే భారత ఫాస్ట్ బౌలర్లు చెలరేగారని చెప్పాడు. తమ టీమ్ లో ప్రతి ఒక్కరు శక్తివంచన లేకుండా కృషి చేయడం వల్లే సిరీస్ ను గెలుపొందామని డీవిలియర్స్ తెలిపాడు. కీలక సమయాల్లో తమ బౌలర్లు పైచేయి సాధించారని చెప్పాడు. టెస్ట్ మ్యాచ్ లు ఎప్పటికీ సవాల్ తో కూడుకున్నవేనని అన్నాడు. 
ab devilliers
south africa cricketer
team india

More Telugu News