vijay: మురుగదాస్ తో సెట్స్ పైకి విజయ్

  • విజయ్ 62వ సినిమాకి సన్నాహాలు 
  • ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ 
  • దీపావళికి ప్రేక్షకుల ముందుకు  

తెలుగు .. తమిళ భాషల్లో 'స్పైడర్' చేసిన మురుగదాస్, ఈ రెండు భాషల్లోను అపజయాలనే మూటగట్టుకున్నాడు. కాస్త గ్యాప్ తీసుకున్న ఆయన విజయ్ కోసం కొత్తగా ఒక కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ కథతో ఈ రోజునే ఆయన సెట్స్ పైకి వెళ్లాడు. విజయ్ కి ఇది 62వ సినిమా .. ఈ సినిమాలో ఆయన సరసన కథానాయికగా కీర్తి సురేశ్ నటిస్తోంది.

ఈ రోజునే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా, రెగ్యులర్ షూటింగ్ ను కూడా ఈ రోజు నుంచే మొదలుపెట్టేసింది. ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించే ఈ సినిమాను దీపావళికి విడుదల చేస్తున్నట్టుగా మురుగదాస్ చెప్పాడు. గతంలో విజయ్ తో మురుగదాస్ చేసిన 'కత్తి' .. 'తుపాకి' సినిమాలు ఘన విజయాలను అందుకున్నాయి. అందువలన ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు వున్నాయి.    

More Telugu News