ram prasad: 'జబర్దస్త్' లో అలా అవకాశం వచ్చింది: రామ్ ప్రసాద్

  • చాలాకాలం క్రితమే హైదరాబాద్ వచ్చాను
  • ఇక్కడ మనకి సరిపడదని వెళ్లిపోయాను 
  • 'జబర్దస్త్' గురించి నా ఫ్రెండ్ చెప్పాడు
  • దాంతో ఇక్కడికి వచ్చేశాను  

'జబర్దస్త్' కార్యక్రమంలో కమెడియన్ గా పేరు తెచ్చుకున్న వాళ్లలో రామ్ ప్రసాద్ ఒకరు. తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడిన ఆయన, తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు. " మొదట్లో నేను ఎడిటింగ్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చాను. ఎడిటింగ్ నేర్చుకుంటూ ఉండగా .. ఓ రైటర్ తారసపడటంతో, స్క్రిప్ట్ రైటింగ్ కూడా మొదలుపెట్టేశాను.

 ఆ సమయంలో 'జోష్' అనే సినిమాలోనూ ఓ చిన్న వేషం వేయడం జరిగింది. ఇక్కడ మనకి ఏదీ సెట్ కాలేదనుకుని, తిరిగి వైజాగ్ వెళ్లిపోయాను. రెండేళ్ల తరువాత నా మిత్రుడు ప్రసన్న కుమార్ ఫోన్ చేసి .. 'జబర్దస్త్' అనే షో స్టార్ట్ అవుతోంది .. నువ్ బాగా రాస్తావ్ గదా ట్రై చేయ్' అన్నాడు. అలా 'జబర్దస్త్'కి వచ్చిన నేను .. రైటర్ గాను . . ఆర్టిస్ట్ గాను కొనసాగుతున్నాను' అని చెప్పుకొచ్చాడు.   

More Telugu News