Telangana: రంగనాయకసాగర్ రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో బైక్ పై మంత్రి హరీశ్ రావు

  • కాళేశ్వరం ప్రాజెక్టు పనులను మహాయజ్ఞంలా చేపట్టాం
  • పనులు వేగవంతం చేయాలి
  • వచ్చే ఖరీఫ్ నాటికి రైతులకు నీళ్లు ఇవ్వాలని మంత్రి ఆదేశం

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు వరుసగా రెండోరోజు రంగనాయకసాగర్ రిజర్వాయర్ పనులను పరిశీలించారు. సిద్దిపేట జిల్లాలోని చంద్లాపూర్ ప్రాంతంలో నిర్మిస్తున్న రంగనాయకసాగర్ రిజర్వాయర్ పనులను ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో బైక్ పై ఆయన పర్యటించారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, కరవు ప్రాంతంగా ఉన్న తెలంగాణకు గోదావరి నీళ్లతో కాళ్లు కడిగి కష్టాలు తీర్చాలన్న తపనతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను మహాయజ్ఞంలా చేపట్టామని అన్నారు. పనులు వేగవంతం చేయాలని, వచ్చే ఖరీఫ్ నాటికి రైతులకు నీళ్లు ఇచ్చేలా పనులు జరగాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. కాగా, కాళేశ్వరం నుంచి నీటిని తరలించే విధానం, పంపులు పనిచేయడం, అక్కడి నుంచి రంగనాయక సాగర్, మల్లన్నసాగర్ రిజర్వాయర్లకు నీళ్లు నింపడం వంటి విషయాలను అక్కడి ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. రంగనాయకసాగర్ రిజర్వాయర్ లో కట్టను ఆయన పరిశీలించారు. నీటి సామర్థ్యం తట్టుకునేందుకు చేపట్టిన అధునాతన పద్ధతులను అడిగి తెలుసుకున్నారు.

More Telugu News