Amaravati: విడిపోయిన తరువాత వచ్చిన అతి పెద్ద చిక్కు ఇదే: చంద్రబాబునాయుడు

  • అమరావతిలో రెండో రోజు మొదలైన కలెక్టర్ల కాన్ఫరెన్స్
  • దక్షిణాదిలో అతి తక్కువ తలసరి ఏపీలోనే
  • ఆదుకోవాలని కేంద్రాన్ని కోరుతూనే ఉన్నా
  • న్యాయం జరుగకుంటే పోరాటానికి సిద్ధం

తెలంగాణ నుంచి విడిపోయి కట్టుబట్టలతో వచ్చిన తరువాత రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పడిపోయిందని, విభజన తరువాత వచ్చిన సమస్యలన్నింటిలోకీ, ఇదే అతిపెద్దదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైన తరువాత చంద్రబాబు మాట్లాడారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ 20 నుంచి 30 శాతం వెనుకబడి ఉందని గుర్తు చేసిన ఆయన, వాటితో సమాన స్థాయికి ఏపీ చేరుకునేంత వరకూ కేంద్రం ఆదుకోవాలని కోరారు.

ఈ విషయంలో తాను ఎప్పటికప్పుడు కేంద్రానికి పరిస్థితిని వివరిస్తూనే ఉన్నానని, న్యాయం జరుగకుంటే, అవసరాన్ని బట్టి సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. దక్షిణ భారత దేశంలో అత్యంత తక్కువ తలసరి ఆదాయం ఉన్నది ఏపీలోనేనని, ఇందుకు ప్రజలు కారణం కాదని, విభజనతో వచ్చిన కష్టమే ఇదని తెలిపారు.

More Telugu News