Kamal Haasan: రజనీకాంత్ పై దర్శకుడు భారతీరాజా సంచలన విమర్శలు!

  • రజనీకాంత్ ఓ నాన్ లోకల్
  • వయసులో ఉండగా హిమాలయాలు పట్టుకు తిరిగాడు
  • వయసు అయిన తరువాత రాజకీయాల్లోకెందుకు?
  • భారతీ రాజా విసుర్లు
తమిళ వ్యక్తులు కాని వారు తమను పాలించేందుకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ప్రముఖ దర్శకుడు భారతీరాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీ రాజకీయాల్లోకి రానున్నారన్న వార్తలపై రాష్ట్రమంతా చర్చ సాగుతున్న వేళ మరో దర్శకుడు సీమాన్ తో కలసి మీడియాతో మాట్లాడిన భారతీ రాజా, రజనీకాంత్ నాన్ లోకల్ అని అన్నారు. విశ్వాస ఘాతుకానికి రజనీ నిలువెత్తు నిదర్శనమని ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన, వయసులో ఉండగా హిమాలయాలు పట్టుకు తిరిగి, వయసుడిగిన తరువాత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తానని అంటున్నాడని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో కనీసం నోటా (నన్ ఆఫ్ ది ఎబౌవ్)తో పోటీ పడలేని బీజేపీ, రజనీని అడ్డుపెట్టుకుని బలాన్ని పెంచుకోవాలని చూస్తోందని ఆరోపించారు. జయలలిత మరణం, కరుణానిధికి అనారోగ్యంగా ఉండటం వల్లే రాజకీయాల్లోకి వస్తామంటూ కమల్, రజనీ వంటి వాళ్లు బయలుదేరారని, లేకుంటే వాళ్లు బయటకు వచ్చేవారా? అని భారతీరాజా ప్రశ్నించారు.
Kamal Haasan
Rajanikant
Bharatiraja
Tamilnadu

More Telugu News