Rashmika: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • డబ్బింగ్ చెప్పిన మరో ముద్దుగుమ్మ 
  • సోషల్ మీడియా ద్వారా రవితేజ పాటలు!
  • తొలిప్రేమ ఆడియో వేడుక 
  • మరో హిందీ సినిమాలో రానా

*  తాజాగా నాగశౌర్య సరసన 'చలో' సినిమాలో నటించిన కన్నడ భామ రష్మిక మందన తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. తెలుగు నేర్చుకుని మరీ ఈ చిన్నది డబ్బింగ్ చెప్పడం విశేషం. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో మరో రెండు సినిమాలు చేస్తోంది.  
*  రవితేజ హీరోగా విక్రం సిరికొండ దర్శకత్వంలో రూపొందుతున్న 'టచ్ చేసి చూడు' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ వారంలోనే హైదరాబాదులో నిర్వహించనున్నారు. అలాగే, చిత్రంలోని ఒక్కో పాటను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో రాశిఖన్నా, శీరత్ కపూర్ హీరోయిన్లుగా నటించారు.
*  వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న 'తొలిప్రేమ' చిత్రం ఆడియో వేడుకను ఈ నెల 20న నిర్వహిస్తారు. అలాగే, వచ్చే నెల 9న చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఇందులో రాశిఖన్నా హీరోయిన్ గా నటించింది.  
*  రానా దగ్గుబాటి తాజాగా ఓ హిందీ చిత్రంలో నటించాడు. కరణ్ జొహార్ నిర్మిస్తున్న 'వెల్కం టు న్యూయార్క్' చిత్రంలో రానా ఓ కీలక పాత్రను పోషించాడు. చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 23న విడుదల చేస్తారు. 

More Telugu News