china: చైనాపై భారీ జరిమానా విధించేందుకు సిద్ధం: కలకలం రేపుతోన్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటన

  • తమ మేధోసంపత్తిని చైనా చోరీ చేసిందని ఆరోపిస్తోన్న అమెరికా
  • చైనాతో సత్సంబంధాలను కొనసాగించాలని మేము భావిస్తున్నాం
  • ఆ దేశం మాత్రం సహకారం అందించడం లేదు- ట్రంప్

తమ మేధోసంపత్తిని చైనా చోరీ చేసిందని ఆరోపిస్తోన్న అమెరికా ఆ దేశంపై భారీ జరిమానా విధించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ... తాము పెద్ద మొత్తంలో జరిమానా విధించేందుకు సిద్ధమవుతున్నామని, త్వరలోనే దీన్ని ప్రకటిస్తామని ప్రకటన చేసి కలకలం రేపారు. తాము చైనాతో సత్సంబంధాలను కొనసాగించాలని భావిస్తోంటే, ఆ దేశం మాత్రం సహకారం అందించడం లేదని ట్రంప్ అంటున్నారు. తమ దేశ కంపెనీలను బలవంతం పెట్టి చైనా మేధో సంపత్తిని బదిలీ చేసుకుందని అన్నారు.

ఇప్పటికే ఈ విషయంపై వాణిజ్య విచారణ చేపట్టామని, దీనిపై త్వరలోనే సిఫారసులు చేస్తామని చెప్పారు. అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్లను, ఐడియాలను చైనాకు చెందిన సంస్థలు చోరీ చేశాయని ఆరోపణలు ఉన్నాయి. మరోపక్క, అమెరికా చేస్తోన్న ఆరోపణలను చైనా ఖండిస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

More Telugu News