siberia: సైబీరియాలో -62 డిగ్రీల సెల్సియ‌స్‌కి చేరిన ఉష్ణోగ్ర‌త‌... ప‌గిలిపోయిన థ‌ర్మామీట‌ర్‌

  • ఓమ్యాకోన్ గ్రామంలో తీవ్ర‌స్థాయికి ఉష్ణోగ్ర‌త‌లు
  • కొన్ని చోట్ల -67 డిగ్రీల సెల్సియ‌స్ కి చేరుకున్న ఉష్ణోగ్ర‌త‌
  • క‌నురెప్ప‌ల మీది నీటి తుంప‌ర కూడా గడ్డ‌క‌డుతున్న వైనం

ప్ర‌పంచంలో అత్యంత చ‌లిగా ఉండే సైబీరియాలోని ఓమ్యాకోన్‌ గ్రామంలో -62 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. దీంతో అక్క‌డ ఏర్పాటు చేసిన థ‌ర్మామీట‌ర్ ప‌గిలిపోయిన‌ట్లు తెలుస్తోంది. ఈ వారంలో చ‌లి తీవ్ర‌త పెర‌గ‌డంతో థ‌ర్మామీట‌ర్‌లో ప‌గుళ్లు వ‌చ్చాయ‌ని అక్క‌డి వాతావ‌ర‌ణ అధికారులు పేర్కొన్నారు. అలాగే కొన్ని చోట్ల -67 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త కూడా న‌మోదైంద‌ని వారు చెబుతున్నారు.

అంటార్కిటికా కాకుండా ఇత‌ర జ‌నజీవ‌న ప్రాంతాల్లో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త -67.7 డిగ్రీల సెల్సియ‌స్‌. ఉష్ణోగ్ర‌త‌లు ఇలాగే ప‌డిపోతే ఆ రికార్డును దాటే అవ‌కాశం ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌లు అభిప్రాయ‌పడుతున్నారు. అక్క‌డి ఉష్ణోగ్ర‌త‌కి క‌నురెప్ప‌ల మీద ఉండే నీటి తుంప‌ర కూడా మంచులా మారిపోతోంది. అక్క‌డి య‌కుస్కు గ్రామంలో నివ‌సించే అన‌స్టేషియా అనే యువ‌తి తీసుకున్న సెల్ఫీ చూస్తే అక్క‌డి చ‌లి తీవ్ర‌త అర్థ‌మ‌వుతోంది.
 

  • Loading...

More Telugu News