trade: ఇవాళ కూడా లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు!

  • ప్రారంభం నుంచే లాభాల బాట‌లో
  • 35,260 వ‌ద్ద ముగిసిన సెన్సెక్స్‌
  • 10,817 వ‌ద్ద స్థిరప‌డిన నిఫ్టీ

నిన్న స‌రికొత్త రికార్డు మార్కును తాకిన సెన్సెక్స్ ఇవాళ అదే మార్కుతో ట్రేడింగ్ ప్రారంభించింది. ఒకానొక స‌మ‌యంలో 400 పాయింట్లు కూడా లాభ‌ప‌డింది. అయితే, మార్కెట్ ముగిసే స‌మ‌యానికి అది తగ్గుతూ వచ్చి, 178 పాయింట్ల లాభంతో 35,260 వద్ద సరికొత్త రికార్డులో ముగిసింది.

మ‌రో వైపు నిఫ్టీ కూడా స్వల్పంగా 28 పాయింట్లు లాభపడి 10,817 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 63.83గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీసీ, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, యూపీఎల్‌ షేర్లు లాభపడగా.. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, హిందాల్కో, అదానీపోర్ట్స్‌, టాటాస్టీల్‌, వేదాంతా లిమిటెడ్‌ షేర్లు నష్టపోయాయి.

More Telugu News