kcr: మాకు ఎవరితోనూ పోటీ, పోలికా లేవు: సీఎం కేసీఆర్

  • ‘ఇండియా టుడే’ సౌత్ కాన్ క్లేవ్ - 2018లో పాల్గొన్న కేసీఆర్
  • ‘తెలంగాణ’ను అభివృద్ధి పథంలో నడపడమే మా విధానం
  • మా రాష్ట్రంలో భవిష్యత్ లో రైతు ఆత్మహత్యలు ఉండవు
  • 2020 నాటికి 28 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాం

తమకు ఎవరితోనూ పోటీ, పోలికా లేవని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే తాము పాటిస్తున్న విధానమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ‘ఇండియా టుడే’ సౌత్ కాన్ క్లేవ్ - 2018 జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ అడిగిన పలు ప్రశ్నలకు కేసీఆర్ సమాధానమిచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్ లో రైతు ఆత్మహత్యలు ఉండవని, 2020 నాటికి రాష్ట్రంలోని కోటి ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని, 28 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామని, సంక్షేమ రంగంలో అనేక పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆరు నెలల్లోనే విద్యుత్ కష్టాలను అధిగమించామని, కొత్త రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 6 వేల మెగావాట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉందని, ఇప్పుడు 14 వేల మెగావాట్లకు పెంచామని అన్నారు.

More Telugu News