mahesh kathi: 'ఓ అబ్బాయిని ప‌వ‌న్ కల్యాణ్ అభిమానులు బ‌ట్ట‌లు విప్పి చిత‌క్కొట్టారు'.. వీడియో పోస్ట్ చేసిన కత్తి మహేశ్!

  • పవన్ కల్యాణ్ అభిమానులు దౌర్జన్యం చేస్తున్నారు
  • ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదు
  • అందుకే నేను గళం విప్పుతున్నాను

సినీనటుడు, జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల తీరు బాగోలేదని, ఆయ‌న‌ను దేవుడని పేర్కొంటూ దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డుతున్నారని సినీ విమ‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేశ్ ఆందోళన వ్య‌క్తం చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఈ రోజు ఓ వీడియోను పోస్ట్ చేసి ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల తీరు ఇదంటూ కామెంట్ చేశారు.

 ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన 'అజ్ఞాత‌వాసి' సినిమాను విమ‌ర్శించినందుకు ఓ అబ్బాయిని ప‌వ‌న్ అభిమానులు బ‌ట్ట‌లు విప్పి చిత‌క్కొడుతున్న‌ట్లు ఈ వీడియోలో ఉంది. ఇటువంటి వాటిపై ఎలా స్పందించాలో కూడా త‌న‌కు తెలియ‌డం లేద‌ని క‌త్తి మ‌హేశ్ పేర్కొన్నారు. ఇటువంటి దౌర్జ‌న్యంపైనే తాను గ‌ళం విప్పుతున్నాన‌ని చెప్పారు. 

More Telugu News