Narendra Modi: మోదీపై విశ్వ హిందూ పరిషత్ నేత తొగాడియా సంచలన ఆరోపణలు

  • నాకు వ్యతిరేకంగా మోదీ కుట్రలు చేస్తున్నారు
  • మోదీకి, జేకే భట్ కు జరిగిన కాల్ రికార్డులు బయటపెట్టాలి
  • అప్పుడు మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి
భారత ప్రధాని నరేంద్ర మోదీపై విశ్వ హిందూ పరిషత్ ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా ఆరోపణలు గుప్పించారు. తనకు వ్యతిరేకంగా మోదీ కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. గత కొన్ని రోజులుగా మోదీకి, అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ జేకే భట్ కు మధ్య జరిగిన కాల్ రికార్డులను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాల్ రికార్డులు బయటకు వస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.

తొగాడియా వ్యవహారంలో వీహెచ్పీ నేతలు మూడు విధాలుగా ముందుకెళ్తున్నారు. కొందరు ఈ వివాదాన్ని ఇప్పటికే రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. మరికొందరు ఈ వ్యవహారంలో ఆరెస్సెస్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. మరికొందరు ఈ వ్యవహారానికి దూరంగా ఉంటున్నారు. ఈ నెల అలహాబాద్ లో మార్గదర్శక్ మండల్, సంత్ ల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో తొగాడియా విషయాన్ని ప్రస్తావించరాదని మరో వర్గం తీర్మానం చేసింది. మరోవైపు, తొగాడియా కూడా ఈ విషయంపై మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
Narendra Modi
praveen togadia
vhp

More Telugu News