padmavath: ‘పద్మావత్‌’ చిత్రం బాగుంది!: ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్

  • సంజయ్ లీలా భన్సాలితో కలిసి ‘పద్మావత్‌’ని వీక్షించిన రవిశంకర్
  • రాజ్ పుత్ లు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు అర్థం లేనివి
  • ఈ చిత్రం రాజ్ పుత్ ల గౌరవాన్ని పెంచుతుంది: రవిశంకర్

‘పద్మావత్‌’ చిత్రం బాగుందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. ‘పద్మావత్‌’ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలితో కలిసి బెంగళూరులోని తన ఆశ్రమంలో ఈ సినిమాను రవిశంకర్ వీక్షించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రంపై రాజ్ పుత్ లు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు అర్థం లేనివని అన్నారు.

ఈ చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వారందరూ ‘పద్మావత్’ చూసి తీరాలని, ఆపై ఓ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఈ చిత్రం రాజ్ పుత్ ల గౌరవాన్ని పెంచుతుందని, రాణీ పద్మావతి దేవి గొప్పతనాన్ని తెలియజేస్తుందని చెప్పిన రవిశంకర్, ఈ చిత్రంలో దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్ ల నటనపై ప్రశంసలు కురిపించారు.

More Telugu News