elections: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్ర ఎన్నికలకు మోగిన గంట

  • త్రిపురలో ఫిబ్రవరి 18న పోలింగ్
  • మేఘాలయ, నాగాలండ్ లో ఫిబ్రవరి 27న పోలింగ్
  • మార్చి 3న ఓట్ల లెక్కింపు

మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. భారత ఎన్నికల కమిషన్ ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ ను ఈ రోజు విడుదల చేసింది. ఈ వివరాలను ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏకే జ్యోతి ఢిల్లీలో మీడియాకు తెలియజేశారు. ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఒక్కో రాష్ట్ర అసెంబ్లీలో 60 చొప్పున సీట్లున్నాయి. ఈవీఎం, వీవీపీఏటీ మెషిన్లను ఎన్నికల్లో వినియోగించనున్నట్టు జ్యోతి చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేటి నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.

షెడ్యూల్

  • త్రిపుర రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 60 సీట్లకు ఫిబ్రవరి 18న పోలింగ్ జరుగుతుంది
  • మేఘాలయ రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 60 సీట్లకు పోలింగ్ ఫిబ్రవరి 27న జరుగుతుంది.
  • నాగాలాండ్ రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 60 సీట్లకు ఫిబ్రవరి 27న పోలింగ్ ఉంటుంది.
  • ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మార్చి 3న నిర్వహిస్తారు.

More Telugu News