agini 5 missile test fired: అగ్ని-5 ప్రయోగ పరీక్ష మరోసారి సక్సెస్... చైనాలోని చాలా ప్రాంతాలను భస్మీపటలం చేయగల శక్తి దీని సొంతం!

  • ఒడిశాలోని అబ్దుల్ కలామ్ దీవి నుంచి ప్రయోగం 
  • విజయవంతమైనట్టు రక్షణ మంత్రి ప్రకటన
  • దీని సామర్థ్యం 5,000 కిలోమీటర్లు

అగ్ని5 ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ ను ఈ రోజు మరోసారి రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని అబ్దుల్ కలామ్ దీవి నుంచి ఇది జరిగింది. ఇది నాలుగోసారి ప్రయోగం. అంతేకాదు ఆఖరు పరీక్ష కూడా. అణు సామర్థ్యం కలిగిన ఈ క్షిపణి చైనాలోని చాలా ప్రాంతాలను భస్మీపటలం చేయగలదు. దీని సామర్థ్యం 5,000 కిలోమీటర్లు. క్షిపణి పొడవు 17 మీటర్లు. అణు సామర్థ్యం కలిగిన అగ్ని 5 క్షిపణిని ఈ రోజు విజయవంతంగా పరీక్షించినట్టు రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అగ్ని 5 క్షిపణి ప్రయోగం చివరిగా 2016 డిసెంబర్ 26న జరిగింది. 

More Telugu News