NTR: బాలకృష్ణ ఆ పని ఎందుకు చేశారో సమాధానం చెప్పాలి: లక్ష్మీ పార్వతి డిమాండ్

  • తెలుగు మహాసభల్లో ఎన్టీఆర్ పేరెక్కడా కనిపించలేదు
  • ఆయన్ను స్మరించుకోకపోవడం బాధను కలిగించింది
  • ఆ సభలకు బాలకృష్ణ ఎందుకు వెళ్లారో చెప్పాలన్న లక్ష్మీ పార్వతి
ఇటీవల హైదరాబాద్ లో వైభవంగా జరిగిన తెలుగు మహాసభల్లో, తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీ రామారావును కనీసం స్మరించుకోకపోవడం తనకెంతో బాధను కలిగించిందని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి విమర్శించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె, ఎన్టీఆర్ పేరును నామమాత్రంగానైనా తలచుకోని సభలకు బాలకృష్ణ వెళ్లారని గుర్తు చేసిన ఆమె, బాలకృష్ణ ఆ పని ఎందుకు చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

ఎన్టీఆర్ కు భారతరత్న రావడం చంద్రబాబునాయుడికి ఎంతమాత్రమూ ఇష్టం లేదని, ఈ విషయంలో ఆయన ఒక్క రోజు కూడా గట్టిగా కృషి చేయలేదని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. ఎన్టీఆర్ పేరును ప్రజల మనసుల్లో నుంచి చెరిపి వేసేందుకే పలు సంక్షేమ పథకాలకు చంద్రబాబు తన పేరును పెట్టుకుంటున్నారని విమర్శించిన ఆమె, చంద్రబాబు ఎన్ని కుయుక్తులు చేసినా తెలుగు ప్రజల మనసుల నుంచి ఎన్టీఆర్ ను తొలగించలేరని అన్నారు.
NTR
Balakrishna
Lakshmi Parvati
Telugu Mahasabhalu
Hyderabad

More Telugu News