saba qamar: వెక్కివెక్కి ఏడ్చిన బాలీవుడ్ నటి సబా.. వీడియో వైరల్!

  • సబా కమర్ పాకిస్థానీ
  • జార్జియా విమానాశ్రయంలో చేదు అనుభవం
  • పాక్ ప్రజలను బయట నీచంగా చూస్తున్నారంటూ ఆవేదన
బాలీవుడ్ మూవీ 'హిందీ మీడియం'లో ఇర్ఫాన్ ఖాన్ తో కలసి నటించిన సబా కమర్ వెక్కివెక్కి ఏడ్చింది. పాకిస్థాన్ కు చెందిన సబా ఓ పాక్ టీవీ చానెల్ తో మాట్లాడుతూ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో తాను ఎదుర్కొన్న కఠినమైన తనిఖీలను, అవమానాలను వెల్లడిస్తూ కన్నీటి పర్యంతం అయింది. కళ్ల నుంచి వస్తున్న నీటిని తుడుచుకుంటూనే ఆమె ఎంతో ఆవేదనతో మాట్లాడింది.

 'హిందీ మీడియం' సినిమా షూటింగ్ కోసం జార్జియాలోని తబ్లిసికి నగరానికి వెళ్లినప్పుడు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని తెలిపింది. పాకిస్థాన్ లో మనమంతా 'పాకిస్థాన్ జిందాబాద్', 'పాకిస్థాన్ జై' అంటూ నినాదాలు చేస్తుంటామని... కానీ, ఇతర దేశాలకు వెళ్లినప్పుడు మనం ఎన్ని అవమానాలకు గురవుతామో చెప్పలేనని ఆవేదన వ్యక్తం చేసింది. ఎంతో అవమానకరంగా తనిఖీలను నిర్వహిస్తారని చెప్పింది.

షూటింగ్ కోసం చిత్ర యూనిట్ తో కలసి జార్జియా వెళ్లినప్పుడు ఏం జరిగిందో తనకు ఇప్పటికీ గుర్తుందని సబా తెలిపింది. చిత్ర యూనిట్ లో ఉన్న వారందరికీ క్లియరెన్స్ ఇచ్చిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది... తనను మాత్రం అదుపులోకి తీసుకుని ప్రశ్నలతో వేధించారని చెప్పింది. ఎన్నో తనిఖీల తర్వాత తనను పంపించారని తెలిపింది. తాను 'పాకిస్థానీ' కావడమే దీనికంతటికీ కారణమని చెప్పింది. పాకిస్థాన్ ప్రజల పరిస్థితి బయట ఇంత ఘోరంగా ఉందన్న విషయం తనకు అప్పుడు అర్థమయిందని భావోద్వేగంతో వెల్లడించింది.

saba qamar
pakistani actress saba qamar

More Telugu News