Vannemreddy Family: 370 ఏళ్ల తరువాత తన వంశవృక్షం మొత్తాన్ని ఓ చోట చేర్చిన సినీ దర్శకుడు రాజా వన్నెంరెడ్డి!

  • అందరి వివరాలూ తెలుసుకుని ఆహ్వానించిన సినీ దర్శకుడు
  • ఇలవేల్పు పైడమ్మ ఉత్సవాలకు కలిసిన బంధుగణం
  • వేదికైన చిలుకూరు - అందరి కళ్లల్లో ఆనందం

పది తరాలు... దాదాపు 370 ఏళ్ల చరిత్ర... ఈ కాలంలో ఎవరు ఎవరికి పుట్టారో, ఎవరు ఎటువైపు వెళ్లి స్థిరపడ్డారో వివరాలు తెలుసుకోవాలంటే... ఆ వివరాలన్నీ తెలుసుకుని, అందరినీ ఓ చోట కలిపితే... ఆ అనుభూతి, అక్కడ వెల్లివిరిసే ఆనందం అంతా ఇంతా కాదు. ఆ పనే చేశారు సినీ దర్శకుడు రాజా వన్నెంరెడ్డి. వన్నెంరెడ్డి వంశవృక్షాన్ని వెలికితీసిన ఆయన మూడు రాష్ట్రాల్లో స్థిరపడిన తన రక్తసంబంధీకులందరినీ కలిపి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సమీపంలోని చిలుకూరు ఇందుకు వేదికైంది. కృష్ణా జిల్లా చినకరగ్రహారం ప్రాంతానికి చెందిన వన్నెంరెడ్డి కుటుంబీకుల్లో కొందరు చిలుకూరు వచ్చి స్థిరపడగా, వారి ఇలవేల్పు పైడమ్మ జాతరను రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాలకు వన్నెంరెడ్డి వంశస్థులందరినీ పిలవాలని సంకల్పించిన ఆయన, గత సెప్టెంబర్ నుంచి శ్రమించారు. ప్రతి ఒక్కరినీ తరలి రావాలని ఆహ్వానించి, వారి తాతముత్తాతల వివరాలు సేకరించారు. అందరితో కలసి అమ్మవారికి పూజలు చేశారు.

More Telugu News