Balakrishna: నాన్నకు గౌరవం దక్కేందుకు పోరాడి తీరుతా: బాలకృష్ణ

  • ఎన్టీఆర్ కు భారతరత్న గౌరవం దక్కాల్సిందే
  • మార్చి నుంచి బయోపిక్ రెగ్యులర్ షూటింగ్
  • వర్ధంతి నాడు నివాళుల తరువాత బాలయ్య
భారతరత్న గౌరవాన్ని దక్కించుకోగల అర్హత ఉన్న వారిలో దివంగత ఎన్టీ రామారావు కూడా ఒకరని, ఆయనకు ఆ గౌరవం దక్కేంత వరకూ పోరాడుతానని ఎన్టీఆర్ కుమారుడు, హీరో బాలకృష్ణ వ్యాఖ్యానించారు. నేడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ ఉదయం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి, తండ్రి స్మారకచిహ్నం వద్ద నివాళులు అర్పించిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడి డిమాండ్ మేరకు ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ త్వరలోనే పూర్తి స్థాయిలో జరుగుతుందని, తెలుగువారు అందరూ గర్వించేలా ఈ చిత్రాన్ని నిర్మించి చూపుతానని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. తన తండ్రి రుణం తీర్చుకునే అవకాశం ఈ బయోపిక్ నిర్మించడం ద్వారా తనకు కలిగిందని భావిస్తున్నట్టు వెల్లడించారు. మార్చి నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని బాలయ్య తెలిపారు.
Balakrishna
NTR
Bio Pic
Bharataratna

More Telugu News