Kathi Mahesh: జిగ్నేష్ మేవానీని కలిసిన కత్తి మహేశ్

  • మంద కృష్ణ మాదిగను పరామర్శించడానికి చంచల్ గూడ జైలుకి జిగ్నేష్
  • జైలు వద్ద జిగ్నేష్‌ను కలిసిన కత్తి మహేశ్
  • ఆయనతో కాసేపు ముచ్చట్లు
ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతోన్న ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రస్తుతం హైదరాబాద్‌లోని చంచల్ గూడ జైలులో ఉన్న నేపథ్యంలో ఆయనను గుజరాత్ యువనేత, ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని కలిసి పరామర్శించిన విషయం తెలిసిందే.

మరోవైపు సినీ విమర్శకుడు కత్తి మహేశ్ కూడా చంచల్ గూడ జైలుకి వచ్చి మంద కృష్ణను కలిశారు. అనంతరం జిగ్నేశ్ మేవానీతో కత్తి మహేశ్ కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను కత్తి మహేశ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా, ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్‌ చేపడుతోన్న ఉద్యమానికి కత్తి మహేశ్ మద్దతు తెలిపారు.    
Kathi Mahesh
Mewani
Hyderabad

More Telugu News