ntr: రాజమౌళి మూవీ బడ్జెట్ 90 కోట్లు .. రెమ్యునరేషన్స్ కాకుండానే సుమా!

  • నెక్స్ట్ మూవీ స్క్రిప్ట్ పై రాజమౌళి కసరత్తు
  • తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో 
  • 2018 దసరాకి రిలీజ్ చేయాలనే ఆలోచన    

ఎన్టీఆర్ .. చరణ్ కాంబినేషన్లో రాజమౌళి మల్టీ స్టారర్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కథ ఓకే చేసిన రాజమౌళి, స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నారు. తాజాగా రాజమౌళి ఈ సినిమాకి సంబంధించి ఒక రఫ్ ఎస్టిమేట్ లిస్ట్ ను నిర్మాతలకు ఇచ్చాడట. ఆ లిస్ట్ ప్రకారం .. 90 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని ఆయన స్పష్టం చేసినట్టుగా సమాచారం.

 అయితే ఇందులో రాజమౌళి .. ఎన్టీఆర్ ... చరణ్ ల పారితోషికాలు లేవు. మిగతా ఖర్చులన్నీ కలుపుకుని ఈ మొత్తం అవుతాయని రాజమౌళి చెప్పినట్టుగా సమాచారం. ఈ సినిమాలో ఎలాంటి గ్రాఫిక్స్ కూడా ఉండవట .. యాక్షన్ సీన్సే ఒక రేంజ్ లో ఉంటాయట. అందువలన ఈ స్థాయి బడ్జెట్ అవుతుందని అంటున్నారు. 2018 దసరాకి తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.    

More Telugu News