Gannavaram: ఓ వైపు రెండు స్పైస్ జెట్ విమానాలు, మరో వైపు ట్రూజెట్... విజయవాడలో ల్యాండింగ్ కాలేక గాల్లో చక్కర్లు!

  • గన్నవరం విమానాశ్రయాన్ని కమ్మేసిన పొగమంచు
  • విజబిలిటీ 50 మీటర్లకు పరిమితం
  • ల్యాండింగ్ కాలేక వెనుదిరిగిన విమానాలు
  • ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు

విజయవాడలో ఈ ఉదయం ఏర్పడిన దట్టమైన పొగమంచు, విజబిలిటీని 50 మీటర్లకు పరిమితం చేయగా, గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన మూడు విమానాలు 40 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టి, దిగే మార్గంలేక వెనుదిరిగి వెళ్లిపోయాయి. ఉదయం 8 గంటలకు ల్యాండ్ కావాల్సిన హైదరాబాద్ - విజయవాడ ట్రూజెట్ విమానం తిరిగి హైదరాబాద్ కు వెళ్లిపోగా, హైదరాబాద్ - విజయవాడ - బెంగళూరు, హైదరాబాద్ - విజయవాడ - హైదరాబాద్ స్పైస్ జెట్ విమానాలు కాసేపు గాల్లో తిరిగి వెనుదిరిగాయి. దీంతో ఆ విమానాలకు టికెట్లు బుక్ చేసుకుని ఎయిర్ పోర్టులకు చేరుకుని బోర్డింగ్ పాసులను తీసుకున్న వారు గంటల కొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత వారంలోనూ ఓ మారు పొగమంచు కారణంగా విజయవాడకు రావాల్సిన మూడు సర్వీసులు రద్దయ్యాయి.

More Telugu News