stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు!

  • మదుపర్ల లాభాల స్వీకరణతో ఒత్తిడి
  • 72 పాయింట్లు కోల్పోయి 34,771 వద్ద ముగిసిన సెన్సెక్స్
  • 41 పాయింట్లు నష్టపోయి 10,700 వద్ద ముగిసిన నిఫ్టీ

కొన్ని రోజులుగా లాభాల బాట‌లో ప‌య‌నించిన స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టపోయాయి. 72 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌ 34,771 వద్ద ముగియగా, నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి 10,700 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లు సానుకూల సంకేతాలతో మెరుగ్గానే ట్రేడింగ్‌ను ఆరంభించినప్పటికీ మదుపర్ల లాభాల స్వీకరణతో ఈ రోజు ఉదయం నుంచి మార్కెట్లు లాభనష్టాల్లో ఊగిసలాడాయని విశ్లేషకులు చెబుతున్నారు.

కాగా, డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.07గా కొనసాగుతోంది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల్లో ముగిస్తే, హిందుస్థాన్‌ పెట్రోలియం, రిలయన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటామోటార్స్‌ షేర్లు నష్టాలను చవి చూశాయి.

More Telugu News