Praveen Togadiya: ఫోన్ స్విచ్చాఫ్ చేసిన కారణమిదే: ప్రవీణ్ తొగాడియా!

  • వెంటాడుతున్న గుజరాత్, రాజస్థాన్ పోలీసులు
  • మధుమేహం పెరిగి నీరసంతోనే ఆసుపత్రికి
  • నాపై అరెస్ట్ వారెంట్ జారీ చట్ట విరుద్ధం
  • మీడియాతో ప్రవీణ్ తొగాడియా
జెడ్ కేటగిరీ భద్రతలో ఉండి, నిన్న ఎవరికీ కనిపించకుండా పోయి, ఆపై ఆసుపత్రిలో ప్రత్యక్షమై, ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన వీహెచ్ పీ నేత ప్రవీణ్ తొగాడియా, తన ఫోన్ ఎందుకు పని చేయలేదన్న విషయాన్ని వెల్లడించారు. గుజరాత్, రాజస్థాన్ పోలీసులు తనను అంతం చేయాలని చూస్తున్నారని, తన సన్నిహితుల ద్వారా విషయాన్ని తాను తెలుసుకున్నానని, అదే సమయంలో తన శరీరంలో షుగర్ స్థాయులు పడిపోవడంతో స్పృహ కోల్పోతున్న పరిస్థితిలో ఆసుపత్రిలో చేరానని చెప్పారు.

ఫోన్ స్విచ్చాఫ్ చేసిన కారణం కూడా అదేనని, తనపై అరెస్ట్ వారెంట్ ను జారీ చేయడం చట్ట విరుద్ధమని అన్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, చావుకు భయపడే వ్యక్తిని కాదని చెప్పిన ఆయన, తనను అంతం చేయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
Praveen Togadiya
Gujarath
Rajasthan
Sugar
VHP

More Telugu News