Moshe: 26/11 దాడుల్లో తల్లిదండ్రులను కోల్పోయిన మోషే.. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ఆ ఇంటికి వచ్చిన వేళ!

  • ముంబైపై 2008లో ఉగ్రదాడి
  • నారిమన్ హౌస్ పై దాడిలో తల్లిదండ్రులను కోల్పోయిన మోషే
  • 13 ఏళ్ల వయసులో తిరిగి పుట్టినప్పటి ఇంటికి

మోషే హోల్జ్ బర్గ్... ఈ పేరు ఎవరికీ గుర్తుండక పోవచ్చేమోగానీ, బేబీ మోషే... నవంబర్ 26, 2008న పాక్ ముష్కరులు ముంబైపై దాడి చేసి ఎంతో మంది అమాయకులను పొట్టన బెట్టుకున్న వేళ, తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారి. ఇజ్రాయిల్ కు చెందిన మోషే, తల్లిదండ్రులతో కలసి ముంబైలో ఉంటూ ఉగ్ర దాడిలో హతులు కాగా, ఆయా శాండ్రా సామ్యూల్ తో కలసి ఇజ్రాయిల్ వెళ్లి, అక్కడే పెరిగి ప్రస్తుతం 13 ఏళ్ల వయసుకు వచ్చిన బాలుడు.

గత సంవత్సరం నరేంద్ర మోదీ ఇజ్రాయిల్ కు వెళ్లినప్పుడు, మోషేను కలుసుకుని, భారత్ కు రావాలని ఆహ్వానించారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ ఇండియాలో పర్యటిస్తుండగా, మోతే కూడా తన ఆయమ్మతో కలసి వచ్చాడు. ఈ సందర్భంగా ముంబైలో తల్లిదండ్రులు మరణించిన నారిమన్ హౌస్ కు మోషే వెళ్లాడు. చిన్నప్పుడు మోషేను చూసిన అక్కడి వారు ఆనంద బాష్పాలు రాలుస్తూ స్వాగతం పలికారు. ముంబైపై దాడి తరువాత ఆయమ్మ సహా మోషేను ఇజ్రాయిల్ కు తీసుకెళ్లిన ఆ దేశ అధికారులు, వారికి ఆశ్రయం కల్పించిన సంగతి తెలిసిందే.

More Telugu News