namitha: నమిత భర్త వీరేంద్ర గరిటె బాగా తిప్పుతాడట!

  • నాకు వంట రాదు
  • వీరూ మంచి కుక్
  • మా అమ్మ మంచి అందగత్తె

16 ఏళ్లకే మిస్ సూరత్ గా ఎంపికైన అందాల నటి నమిత... 'సొంతం' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాలతో బాగా బిజీ అయిపోయింది. కొన్ని రోజుల క్రితమే తన స్నేహితుడు వీరేంద్ర చౌదరిని నమిత పెళ్లాడింది. తాజాగా ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించింది నమిత. తన తల్లి కూడా అందగత్తె అని చెప్పింది.

తొలి నాళ్లలో సినిమాల్లోకి రావడం తన లక్ష్యం కాదని... మోడల్ కావాలని అనుకున్నానని చెప్పింది. తనకు వండటం రాదని... తన భర్త వీరూ మంచి కుక్ అని తెలిపింది. కేక్స్ కూడా బేక్ చేస్తాడని చెప్పింది. 2001లో మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొన్నానని తెలిపింది.

'సొంతం' సినిమా ఆడిషన్ కోసం తాను హైదరాబాద్ వచ్చానని... ఆ ఆడిషన్ కు ఆ ఒక్క రోజే మరో 40 మంది అమ్మాయిలు కూడా వచ్చారని నమిత తెలిపింది. ఆడిషన్ లో తన ఫస్ట్ డైలాగ్ 'జలుబు వస్తుంది' అని నవ్వుతూ చెప్పింది. తాను సినిమాకు ఎంపిక కాననే అనుకున్నానని... కానీ, లక్కీగా హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యానని తెలిపింది. 

More Telugu News