జైల్లోని లాలూకు సంక్రాంతి స్పెషల్.. ఇష్టమైన ఆహారాన్ని తీసుకొచ్చిన అనుచరులు!
- లాలూకి ఎంతో ఇష్టమైన వంటకం ‘దహీ చుర్రా’
- పండుగ ప్రత్యేక వంటకాన్ని రుచి చూసిన ఆర్జేడీ అధినేత
- ముగ్గురిని మాత్రమే లోనికి అనుమతించిన అధికారులు
జైల్లోని లాలును ముగ్గురు తప్ప ఎక్కువ మంది కలవడానికి వీల్లేదని ఈనెల 10న సీబీఐ న్యాయమూర్తి ఆదేశించారు. అయితే పండుగ వస్తోందని, కాబట్టి పునరాలోచించాలని న్యాయమూర్తిని లాలు కోరారు. ఆయన అభ్యర్థనను జడ్జి తిరస్కరించారు. దీంతో ఆదివారం ‘దహీ చుర్రా’తో ఆయన అనుచరులు పలువురు వచ్చినా కేవలం ముగ్గురిని మాత్రమే అధికారులు లోనికి అనుమతించారు.