Chandrababu: మమతా బెనర్జీ నుంచి చంద్రబాబు ధైర్యాన్ని అప్పు తెచ్చుకోవాలి: సీపీఐ నేత నారాయణ

  • ‘కేంద్రం’తో పోరాడేందుకు చంద్రబాబుకు రాజకీయ బలం సరిపోవడం లేదు
  • బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపైనా విమర్శలు
  • బీజేపీ హోల్ సేల్ మాల్ లాంటిది
  • కాంగ్రెస్ పార్టీ చిల్లరకొట్టు వంటిది: నారాయణ విమర్శలు 

‘కేంద్రం’తో పోరాడేందుకు చంద్రబాబుకు రాజకీయ బలం సరిపోవడం లేదని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి ధైర్యాన్ని చంద్రబాబు అప్పు తెచ్చుకోవాలని ఘాటు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ గురించి ప్రస్తావిస్తూ, దేశంలో బీజేపీని సమర్థించే వాళ్లంతా గంగిగోవులతో సమానమని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ పార్టీని ఎదిరించిన వారు జైలు పాలవడం ఖాయమని అన్నారు. బీజేపీ హోల్ సేల్ మాల్ లాంటిది అయితే, కాంగ్రెస్ పార్టీ చిల్లరకొట్టు లాంటిదని విమర్శలు గుప్పించారు.

More Telugu News