Karnataka: ప్రియుడితో ఆనందించేందుకు స్వయంగా దొంగతనాలకు దిగిన ప్రేయసి!

  • కర్ణాటకలో ఘటన
  • హాస్టల్స్ కు వెళ్లి ల్యాప్ టాప్ లను దొంగిలిస్తున్న శోభ
  • విస్తృతంగా శోధించి నిందితురాలిని పట్టుకున్న పోలీసులు

మనసుకు నచ్చిన యువకుడితో ఆనందంగా గడిపేందుకు దొంగతనాలను అలవాటు చేసుకున్న ఓ విద్యావంతురాలు పోలీసులకు అడ్డంగా దొరికి ఊచలు లెక్కిస్తోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, బెంగళూరులోని మైకోలేటౌట్ లో ఉన్న పీజీ హాస్టల్స్ లో తరచూ ల్యాప్ టాప్ లు పోతున్నాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగితే, డిప్లమో పూర్తి చేసిన శోభ (23) దీనికి కారణమని తేలింది.

సదరు యువతి, పీజీ హాస్టల్స్ కు వెళ్లి, అక్కడ తనకు వసతి కావాలని కోరేది. గదులను చూడాలన్న నెపంతో లోపలికి వెళ్లి ల్యాప్ టాప్ లను మాయం చేస్తుండేది. తరచూ ల్యాప్ టాప్ లు పోతుండటంతో పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టి, ఎన్నో సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించి శోభను నిందితురాలిగా తేల్చారు. ఆమెను అరెస్ట్ చేసి లక్షలాది రూపాయల విలువైన ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆమె దొంగతనాలు చేస్తున్నదన్న విషయం ఆమె ప్రియుడికి తెలియకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News