Rashikhanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • వరల్డ్ టూర్ వేస్తానంటున్న కథానాయిక 
  • రిపబ్లిక్ డే నాడు రంగంలోకి కమల్!
  • రీమేక్స్ ఇష్టం వుండదంటున్న బాలయ్య 
  • వెరైటీ పాత్రలో అందాల శ్రియా

*  అందాల రాశిఖన్నాకు ప్రపంచం అంతా ఓ టూర్ వేసి రావాలన్న కోరిక వుందట. "ప్రపంచంలో చూడతగ్గ అన్ని ప్రదేశాలను సందర్శించి రావాలన్నది నాకు చిన్నప్పటి నుంచీ వున్న కోరిక. ఇప్పటికిప్పుడు కాదు కానీ, ఎప్పటికైనా ఆ కోరికను తీర్చుకుంటాను.  కొత్త ప్రదేశాలు చూడడమంటే నాకు ఎంతో ఇష్టం"  అంటూ చెప్పుకొచ్చింది రాశి.
*  ప్రముఖ నటుడు కమలహాసన్ తాను రాజకీయాలలోకి వస్తున్నట్టుగా ఇటీవల ప్రకటించిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఈ నెల 26 (రిపబ్లిక్ డే) నుంచి తన రాజకీయ పర్యటనను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. తమిళనాడు రాష్ట్రమంతటా ఈ పర్యటన సాగుతుందని చెప్పారు.
*  తనకు రీమేక్స్ లలో నటించడం అంటే ఇష్టం ఉండదని చెప్పారు నందమూరి బాలకృష్ణ. గతంలో ఓ రీమేక్ చేశానని, అయితే అది ఫ్లాపయిందని అన్నారు.ఒకవేళ  రీమేక్ హిట్టయినా కూడా ఆ క్రెడిట్ అంతా ఒరిజినల్ లో నటించిన హీరోకే వెళ్లిపోతుందని, అందుకే తనకు ఇష్టం ఉండదని తెలిపారు.
*  తన తర్వాత ఎంతమంది వచ్చినా ఇప్పటికీ అవకాశాలు పొందుతూ కథానాయికగా కొనసాగుతున్న శ్రియా తాజాగా తెలుగులో మరో చిత్రాన్ని అంగీకరించింది. నూతన దర్శకురాలు సుజన దర్శకత్వంలో కెమెరామెన్ జ్ఞానశేఖర్ నిర్మించే ఈ చిత్రంలో విపరీత స్వభావంతో కూడిన పాత్రను శ్రియా పోషిస్తుందట.  

More Telugu News