Hyderabad: ఉగ్రవాదుల దాడి అనుమానంతో శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్!

  • నిఘా వర్గాల నుంచి సమాచారం
  • ప్రతి వాహనాన్నీ తనిఖీ చేస్తున్న పోలీసులు
  • 31 వరకూ పాస్ ల జారీ రద్దు

గణతంత్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న వేళ, విమానాశ్రయాలపై ఉగ్రవాదులు దాడులు చేయవచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో సెక్యూరిటీని పెంచారు. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలర్ట్‌ ప్రకటించారు. విమానాశ్రయానికి వచ్చి వెళ్లే రహదారుల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. విమానాశ్రయం వద్ద సెక్యూరిటీని మరింతగా పెంచారు. ఈమేరకు ఈనెల 31 వరకూ, ఎయిర్‌పోర్టులో వీఐపీ, వీవీఐపీ పాసులను జారీ చేయబోమని అధికారులు తెలిపారు.

 ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తరువాతనే పార్కింగ్ లోకి అనుమతిస్తున్నామని సీఐఎస్‌ఎఫ్‌ అధికారి ఒకరు తెలిపారు. బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ లతో సోదాలు జరుపుతున్నామని, పాసింజర్‌ టర్మినల్‌ తో పాటు కార్గో టెర్మినల్‌, వీఐపీల ప్రవేశం గేట్, వీవీఐపీ గేట్ లతో పాటు పార్కింగ్ ప్రాంతాలు, బస్టాండు, ట్యాక్సీ స్టాండ్‌ తదితర ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా హై అలర్టు కొనసాగిస్తామని ఆర్జీఐఏ అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News