KTR: జైల్లో చిప్పకూడు తిన్నవారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు: కేటీఆర్

  • కరెంట్ పై చర్చకు సవాల్ విసిరిన రేవంత్
  • చిప్ప కూడు తిన్నవాళ్లతో చర్చ ఏంటన్న కేటీఆర్
  • టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య మాటల తూటాలు

తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ తీవ్ర పదజాలంతో పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ప్రారంభమైనప్పటి నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ రంగంలో అవినీతి చోటు చేసుకుందని రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని, ప్రభుత్వం అందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.

 దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, జైల్లో చిప్ప కూడు తిన్నవారి ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. వ్యవసాయానికి 24 గంటలపాటు కరెంట్ ఇచ్చే కార్యక్రమం విజయవంతం కావడాన్ని కాంగ్రెస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ స్థిరపడితే, భవిష్యత్తులో ఎప్పటికీ అధికారంలోకి రాలేమనే భయం కాంగ్రెస్ నేతల్లో ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అందుకే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. కరెంట్ కొనుగోలుపై ఎలాంటి ఆధారాలు ఉన్నా కోర్టుకు వెళ్లవచ్చని చెప్పారు. 

More Telugu News