Kathi Mahesh: సంక్రాంతికి ఊరెళుతుంటే, పవన్ ఫ్యాన్స్ వెంటపడ్డారు: కత్తి సంచలన ఆరోపణ

  • స్వగ్రామానికి బయలుదేరిన కత్తి మహేష్
  • పీలేరు సమీపంలో వెంబడించిన బైకర్లు
  • ట్విట్టర్ లో తెలిపిన కత్తి
తన స్వగ్రామంలో జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు సొంత ఊరికి వెళుతుంటే, పవన్ కల్యాణ్ అభిమానులు తన వెంటపడ్డారని సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ కొద్ది సేపటి క్రితం ట్వీట్ చేశాడు. "నేను ఇప్పుడే మా గ్రామానికి చేరుకున్నా. దారి మధ్యలో పీలేరు సమీపంలో ఇద్దరు బైకర్లు నన్ను గుర్తు పట్టి, కారును వెంబడించడంతో పాటు 'జై పవన్ కల్యాణ్' అని నినాదాలు చేశారు. నేను ఇంటికి వచ్చిన తరువాత నాకు అర్థమైంది ఏమంటే, ఇటీవల నాకోసం విజయవాడ, తిరుపతి, మదనపల్లి, పుత్తూరు ప్రాంతాల నుంచి మా గ్రామానికి పవన్ అభిమానులు వచ్చి నాకోసం వెతికారు" అని వెల్లడించాడు.
Kathi Mahesh
Pawan Kalyan
twitter

More Telugu News