Jagan: రైతులతో కలసి పొలంలో నాట్లు వేసిన వైఎస్ జగన్‌!

  • చిత్తూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్ పాదయాత్ర
  • రైతులు, ప్రజా సంఘాలతో ముచ్చట
  • క‌మ్మ‌ప‌ల్లె గ్రామానికి సమీపంలో ఉన్న వరి పంటపొలాన్ని సందర్శించిన జ‌గ‌న్‌

ప్ర‌జా సంకల్ప యాత్ర పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తోన్న పాద‌యాత్ర కొన‌సాగుతోంది. ఈ రోజు చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని రామచంద్రపురం, క‌మ్మ‌ప‌ల్లె, తిమ్మరాజుపల్లి పాటు ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. వివిధ ప్రజాసంఘాలను కలుసుకుంటూ, సాధారణ ప్రజలను పలకరిస్తూ జ‌గ‌న్‌ పాదయాత్ర ముందుకు సాగుతోంది.

క‌మ్మ‌ప‌ల్లె గ్రామానికి సమీపంలో ఉన్న వరి పంటపొలాన్ని సందర్శించిన జ‌గ‌న్‌.. అక్క‌డి రైతుల‌తో క‌లిసి పొలంలో నాట్లు వేశారు. అనంత‌రం నిర్వ‌హించిన ర్యాలీలో మాట్లాడుతూ... హెరిటేజ్‌ ఫ్యాక్టరీకి లాభాల కోసం ప్ర‌భుత్వ నేత‌లు చిత్తూరు, విజయ డయిరీలను మూత వేయించారని, విజయ డయిరీలకు పాలు పోస్తే డబ్బులు రావు అన్నట్లు ఒక పద్ధతి ప్రకారం మూత వేయించారని ఆరోపించారు.



More Telugu News