gazal srinivas: గజల్ శ్రీనివాస్‌కు మరో 2 వారాల పాటు జ్యుడీషియల్ కస్టడీ.. పరారీలో పనిమనిషి పార్వతి!

  • మీడియాతో మాట్లాడేందుకు గజల్ శ్రీనివాస్ విముఖత
  • మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు
  • ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన పార్వతి
ఆలయవాణి రేడియోలో పనిచేస్తోన్న యువతిని వేధించిన కేసులో గాయకుడు, రచయిత గజల్ శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. చంచల్‌గూడ జైలులో ఉన్న గజల్ శ్రీనివాస్ జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియడంతో ఆయనను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా, ఆయనకు ఈ నెల 25 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

కాగా, కోర్టు వద్ద మీడియాతో మాట్లాడేందుకు గజల్ శ్రీనివాస్ నిరాకరించారు. మరోపక్క, ఆయన మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై కోర్టు విచారణ జరపాల్సి ఉంది. మరోవైపు ఈ కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న పార్వతి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ముందస్తు బెయిలు కోసం పిటిషన్ వేసింది.   
gazal srinivas
molest
nampally court

More Telugu News