america: అమెరికాలో హత్యకు గురైన కూచిభొట్ల శ్రీనివాస్‌ భార్యకు ట్రంప్ వర్గం నుంచి ఆహ్వానం!

  • స్టేట్‌ ఆఫ్‌ యూనియన్‌ అడ్రెస్‌ కార్యక్రమంలో పాల్గొననున్న సునయన
  • డొనాల్డ్‌ ట్రంప్‌ వర్గానికి చెందిన ప్రతినిధి కెవిన్‌ యోడర్‌ నుంచి ఆహ్వానం
  • నాకు పూర్తి మద్దతు లభిస్తోంది: సునయన 

అమెరికాలోని కాన్సాస్‌లో గతేడాది భారతీయ టెకీ కూచిభొట్ల శ్రీనివాస్‌ను ఓ దుండగుడు హత్య చేసిన విషయం తెలిసిందే. అమెరికాలో జరుగుతోన్న జాతివివక్ష పట్ల అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. కాగా, కూచిభొట్ల శ్రీనివాస్‌ భార్యకు అమెరికా ఆహ్వానం పంపింది. ఈ నెల 30న అమెరికాలో స్టేట్‌ ఆఫ్‌ యూనియన్‌ అడ్రెస్‌ కార్యక్రమంలో పాల్గొనాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వర్గానికి చెందిన ప్రతినిధి కెవిన్‌ యోడర్‌  కోరారు.

కాగా, భర్త శ్రీనివాస్ మృతితో భార్య సునయన అమెరికాలో తన పౌరసత్వాన్ని కోల్పోయారు. అయినప్పటికీ, అమెరికాలో ఉండడానికి అక్కడి అధికారులు ఆమెకు అనుమతిచ్చారు. తాజాగా సునయన మీడియాతో మాట్లాడుతూ... అమెరికాలోని తన స్నేహితులు, కుటుంబీకుల నుంచి తనకు పూర్తి మద్దతు లభిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఆమె త్వరలోనే ఇండియాకు రానున్నారు.  

More Telugu News