rojaramani: చంద్రమోహన్ తో డాన్స్ .. నానా తంటాలు పడ్డాను: రోజారమణి

  • చంద్రమోహన్ తో 'రామాలయం' చేశాను 
  • మా ఇద్దరిపై ఒక పాట వుంది 
  • సిల్క్ చీరతో చాలా ఇబ్బంది పడ్డాను

హీరోయిన్ గా .. కేరక్టర్ ఆర్టిస్ట్ గా రోజారమణికి మంచి పేరుంది. అలాంటి ఆమె తన కెరియర్ కి సంబంధించిన కొన్ని విషయాలను ఐ డ్రీమ్స్ తో పంచుకున్నారు. ఒక పాట కోసం తాను ఎంతగా ఇబ్బంది పడింది చెప్పుకొచ్చారు. " 'రామాలయం' అని ఒక సినిమా చేస్తున్నాను. ఈ సినిమాలో నేను చంద్రమోహన్ కి జంటగా నటించాను. అత్తగారు సూర్యకాంతం లేనప్పుడు మా ఇద్దరి మధ్య ఒక పాట ఉంటుంది''

''ఆ పాట కోసం కట్టుకోమంటూ నాకు ఒక సిల్క్ చీర ఇచ్చారు. అది జారిపోతుందని చెప్పినా వినిపించుకోలేదు. ఆ చీరతో డాన్స్ చేయడానికి నానా తంటాలు పడుతున్నాను. నా ఇబ్బందిని అర్థం చేసుకున్న చంద్రమోహన్, 'ఎందుకయ్యా ఆ పిల్లను అలా ఇబ్బంది పెడతారు .. ఇలా అయితే పది రోజులకు కూడా ఈ పాట పూర్తి కాదు .. ఆ చీర కట్టుకున్నట్టుగా కుట్టించుకు రండి' అన్నారు. ''ఆయన ఇచ్చిన ఐడియాతో ఆ పాటను ఫినిష్ చేశాం'' అని అన్నారు.

More Telugu News