niharika: 'సూర్యకాంతం'గా కనిపించనున్న నిహారిక?

  • ప్రణీత్ దర్శకత్వంలో నిహారిక 
  • హీరోలుగా కొత్త కుర్రాళ్లు 
  • త్వరలో సెట్స్ పైకి      

'ఒక మనసు' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన నిహారిక, ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుంది. ఇక ఇప్పుడిప్పుడే ఆమె వరుసగా సినిమాలను అంగీకరిస్తూ వెళుతోంది. తెలుగులో సుమంత్ అశ్విన్ తో 'హ్యాపీ వెడ్డింగ్' షూటింగును పూర్తి చేసిన నిహారిక, ఓ తమిళ సినిమాతోను అక్కడి ప్రేక్షకులను పలకరించనుంది.

 ఈ నేపథ్యంలోనే ఆమె 'సూర్యకాంతం' అనే సినిమాను చేయనుందనే టాక్ వినిపిస్తోంది. గతంలో నిహారిక ప్రధాన పాత్రగా 'ముద్దపప్పు ఆవకాయ్' వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించిన ప్రణీత్, ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు చెబుతున్నారు. అదిత్ అరుణ్ .. కాళిదాస్ అనే కొత్త కుర్రాళ్లు ఈ సినిమాలో హీరోలుగా కనిపించనున్నారు. నాగబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం, ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం.      

More Telugu News