l ramana: టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ హౌస్ అరెస్ట్!

  • రమణ, మందాడిలు గృహ నిర్బంధం
  • వంటేరును జైలుకు పంపిన నేపథ్యంలో ర్యాలీకి పిలుపు
  • ర్యాలీని భగ్నం చేసిన పోలీసులు

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణను హైదరాబాద్ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయనతో పాటు కేపీహెచ్ బీ కాలనీలో నివాసం ఉండే మరో నేత, కార్పొరేటర్  మందాడి శ్రీనివాసరావును కూడా హౌస్ అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, తెలుగు రైతు అధ్యక్షుడు వంటేరు ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేసిన జైలుకు పంపారు. దీంతో, ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి సీఎం క్యాంప్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీకి టీడీపీ శ్రేణులు పిలుపునిచ్చాయి. వంటేరుపై అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశాయి. దీంతో, ఈ ర్యాలీని భగ్నం చేసే క్రమంలో టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 

  • Loading...

More Telugu News