'అజ్ఞాతవాసి' కథతో వచ్చినప్పుడు త్రివిక్రమ్ ఒక మాట అన్నారు!: ఖుష్బూ

12-01-2018 Fri 09:44
  • మంచి పాత్ర కోసం వెయిట్ చేశాను 
  • 'అజ్ఞాతవాసి'లో అలాంటి పాత్ర దక్కింది 
  • నాకు బాగా నచ్చిన పాత్ర అది
'అజ్ఞాతవాసి' సినిమాలో పవన్ సరసన కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించగా, ఖుష్బూ ఒక కీలకమైన పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన విషయాలను గురించి ఖుష్బూ ప్రస్తావిస్తూ .. "చాలా కాలంగా నేను మంచి పాత్ర కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ కారణంగా తెలుగు .. తమిళ సినిమాలను నేను ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో ఒక రోజున త్రివిక్రమ్ గారు 'అజ్ఞాతవాసి' కథతో మా ఇంటికి వచ్చారు.

కథ చెప్పడానికి ముందుగానే 'మేడమ్, ఈ పాత్రకి మాత్రం మీరు నో చెప్పొద్దు .. ప్లీజ్' అన్నారు. కథ విన్న తరువాత నా పాత్ర నాకు బాగా నచ్చేసింది. అందువలన వెంటనే ఓకే చెప్పేశాను. నా పాత్రకి వస్తోన్న రెస్పాన్స్ నాకు చాలా సంతోషాన్ని .. సంతృప్తిని కలిగిస్తోంది. ఇక పవన్ విషయానికి వస్తే, ఆయన చాలా తక్కువగా మాట్లాడతారు. ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో సౌకర్యవంతంగా వుంది' అని చెప్పుకొచ్చారు.