Rail: పండుగ ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే.. మచిలీపట్నానికి నేడు ప్రత్యేక రైలు

  • నేటి రాత్రి 10:40 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరనున్న రైలు
  • ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్న రైల్వే
  • పండుగ రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైలు 

పండుగ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లు వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్న వారి సౌకర్యార్థం నేడు హైదరాబాద్ నుంచి మచిలీపట్టణానికి ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు ప్రకటించింది. రాత్రి 10:40 గంటలకు హైదరాబాద్‌లో రైలు (07250) బయలుదేరి 11:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని, సికింద్రాబాద్‌లో 11:35 గంటలకు బయలుదేరి శనివారం ఉదయం 10 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News