పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ని సందర్శించిన గవర్నర్ దంపతులు... ఆ దృశ్యాల చిత్ర మాలిక!

11-01-2018 Thu 21:36
  • అత్యున్నత సేవలకు మరోమారు జాతీయస్థాయి అవార్డు అందుకున్న పంజాగుట్ట పీఎస్
  • రాష్ట్ర పోలీసుల పని తీరుకు ఈ అవార్డే నిదర్శనం
  • అధికారులు, సిబ్బంది కృషి వల్లే గుర్తింపు దక్కింది: నరసింహన్

దేశంలోనే అత్యున్నత సేవలందించినందుకు గాను హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ జాతీయ స్థాయిలో రెండోసారి అవార్డును దక్కించుకుంది. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ దంపతులు ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ని సందర్శించారు. పోలీసు అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, స్వచ్ఛతను, ట్యాబ్ సేవలు, కార్యాలయంలో అందిస్తున్న అత్యాధునిక సేవలను నరసింహన్ కొనియాడారు.

అంతే కాకుండా, డస్ట్ ఫ్రీజోన్, మహిళా సిబ్బంది విశ్రాంతి గదులను వారు పరిశీలించారు. అనంతరం, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ, పంజాగుట్ట పీఎస్ దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా రెండోసారి అవార్డు అందుకోవడం గర్వకారణమని అన్నారు. రాష్ట్ర పోలీసుల పనితీరుకు ఈ అవార్డే నిదర్శనమని, అధికారులు, సిబ్బంది కృషి వల్లే పంజాగుట్ట పీఎస్ కు మరోమారు గుర్తింపు దక్కిందని అన్నారు.