sidharamaiah: బీజేపీ, ఆరెస్సెస్ లను నేను నేరుగా నిందించలేదు: సిద్ధరామయ్య

  • బీజేపీ, ఆరెస్సెస్ లను ఉగ్ర సంస్థలు అనలేదు
  • హిందూ ఉగ్రవాదం గురించే మాట్లాడా
  • శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం

కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ బీజేపీ, ఆరెస్సెస్ లు ఉగ్రవాద సంస్థలంటూ నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, ఒక్క రోజు తిరక్కుండానే ఆయన యూటర్న్ తీసుకున్నారు.

తాను బీజేపీ, ఆరెస్సెస్ లను నేరుగా విమర్శించలేదని చెప్పారు. కేవలం హిందూ ఉగ్రవాదం గురించే తాను మాట్లాడానని అన్నారు. రాజకీయ అస్తిత్వం కోసం హిందూ ఉగ్రవాదాన్ని బీజేపీ, ఆరెస్సెస్ లు పెంచుతున్నాయని మాత్రమే తాను చెప్పానని తెలిపారు. విద్వేషాన్ని, హింసను వ్యాప్తి చేసేవాళ్లు తన దృష్టిలో ఉగ్రవాదులే అని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించబోమని తెలిపారు.

More Telugu News