pdp mla: హురియత్‌, వేర్పాటువాదులు, ఉగ్రవాదులు మా సోదరులు: పీడీపీ ఎమ్మెల్యే

  • ఎమ్మెల్యే ఐజాజ్‌ అహ్మద్‌ మిర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు
  • కశ్మీర్‌ సమస్యను పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైంది
  • ఆందోళనలను నిరోధించాలంటే వారితో చర్చలు జరపాలి
  • వారిని మీడియా ఉగ్రవాదులు అననీ.. ఏమైనా అననీ
జమ్ముకశ్మీర్‌ అధికార పార్టీ పీడీపీ ఎమ్మెల్యే ఐజాజ్‌ అహ్మద్‌ మిర్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... హురియత్‌, వేర్పాటువాదులు, ఉగ్రవాదులను తమ సోదరులంటూ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ సమస్యను పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందని, అక్కడ జరుగుతోన్న ఆందోళనలను నిరోధించాలంటే వారితో చర్చలు జరపాలని వ్యాఖ్యానించారు. వాళ్లని మీడియా ఉగ్రవాదులు లేక ఇంకా ఏ పేరుతో పిలుస్తున్నప్పటికీ వాళ్లందరూ కశ్మీరీలని, తమ సోదరులని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది.
pdp mla
terrorist
brothers

More Telugu News