army day: ఆర్మీ డే రిహార్స‌ల్స్‌లో అప‌శ్రుతి.. హెలికాప్ట‌ర్ నుంచి అదుపుత‌ప్పి కింద‌ప‌డిన జ‌వాన్లు.. వీడియో చూడండి!

  • గాయాల‌పాలైన ముగ్గురు జ‌వాన్లు
  • జ‌న‌వ‌రి 15న జ‌ర‌గ‌నున్న ఆర్మీ డే
  • ప్ర‌ద‌ర్శ‌న‌ల కోసం రిహార్స‌ల్స్ చేస్తున్న జ‌వాన్లు

ఆర్మీ డే ప్ర‌ద‌ర్శ‌నల కోసం జ‌వాన్లు చేస్తున్న రిహార్స‌ల్స్‌లో అప‌శ్రుతి చోటుచేసుకుంది. ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్ట‌ర్ మీది నుంచి తాడు స‌హాయంతో కింద‌కి దిగుతుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. తాడు ఒక్క‌సారిగా ప‌ట్టుకోల్పోవ‌డంతో ముగ్గురు సైనికులు అదుపుత‌ప్పి కింద‌ప‌డ్డారు. వారిని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వారి ప్రాణాల‌కు ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని, స్వ‌ల్పంగా గాయాలు అయ్యాయ‌ని డాక్ట‌ర్లు తెలిపారు.

అయితే ఈ ప్ర‌మాదానికి సంబంధించిన వీడియో ఒక‌టి ఇంట‌ర్నెట్‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది. హెలికాప్ట‌ర్ మీది నుంచి సైనికులు కింద ప‌డడం, మూడో సైనికుడు చాలా ఎత్తు నుంచి కింద‌ప‌డ‌టం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ సంఘ‌ట‌న కార‌ణాల‌పై విచార‌ణ ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది. భార‌త ఆర్మీ మొద‌టి భార‌తీయ‌ క‌మాండ‌ర్ ఇన్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ కేఎం క‌రియ‌ప్ప బాధ్య‌త‌లు తీసుకున్న జ్ఞాప‌కంగా ప్ర‌తి ఏడాది జ‌న‌వ‌రి 15న ఈ ఆర్మీ డే నిర్వ‌హిస్తారు.

  • Loading...

More Telugu News