vishwak: తరుణ్ భాస్కర్ సినిమాకి టైటిల్ ఖరారు!

  • సురేష్ ప్రొడక్షన్స్ లో తరుణ్ భాస్కర్
  • విష్వక్ సేన్ .. అనీషా ఆంబ్రోస్ జంటగా
  • 'ఈ నగరానికి ఏమైంది' టైటిల్ ఖరారు

'పెళ్లిచూపులు' సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా బాగా ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. చిన్న సినిమా సాధించిన అతి పెద్ద విజయంగా ఈ సినిమా నిలిచింది. దాంతో తరుణ్ భాస్కర్ తరువాత సినిమా ఏమిటనే ఆసక్తి అభిమానుల్లో వుంది.

ప్రస్తుతం ఆయన 'వెళ్లిపోమాకే' హీరో విష్వక్ సేన్ .. అనీషా ఆంబ్రోస్ జంటగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకి, 'ఈ నగరానికి ఏమైంది?' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించినప్పుడు వెంకీ - తేజ సినిమా కోసం అన్నట్టుగా ప్రచారం జరిగింది. తరుణ్ భాస్కర్ సినిమా కోసం ఈ టైటిల్ ను ఖరారు చేశారనేది తాజా సమాచారం.      

More Telugu News