traffic: భాగ్యనగరంలో ట్రాఫిక్ పోలీసుల నజర్... 12 పాయింట్లు దాటితే వాహనం నడపకుండా నిషేధం!

  • 14 పాయింట్లకు చేరిన వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు చర్యలు
  • నోటీసులు జారీ చేసిన ఆర్టీఏ అధికారులు
  • ప్రతీ ఉల్లంఘనకు పాయింట్లు నమోదు

జంట నగరాల్లో ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించే వారి పని పడుతున్నారు. సిగ్నల్స్ జంపింగ్, హెల్మెట్ లేకుండా నడపడం, తాగి నడపడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం.. ఇలా ఒకటేమిటి, తమ కంట్లో పడిన ప్రతీ ఉల్లంఘనను లెక్క పెట్టి ఆయా ఉల్లంఘనుల డ్రైవింగ్ లైసెన్స్ ఖాతాలో పాయింట్లుగా నమోదు చేస్తున్నారు.

12 పాయింట్లు దాటితే వారు వాహనం నడిపేందుకు అవకాశం లేకుండా నిషేధం విధిస్తున్నారు. హైదరాబాద్ లో మౌలాలీకి చెందిన రుషబ్ మహేంద్రమేనియా అనే వాహనదారుడు ఇలా 14 పాయింట్లకు చేరుకోవడంతో అతని లైసెన్స్ ను రద్దు చేసేందుకు రవాణా శాఖ నోటీసులు కూడా జారీ చేసింది.

నగరంలో 7 పాయింట్లు పోగేసుకున్న వారి సంఖ్య 46 కాగా, 152 మంది ఖాతాలో 6 పాయింట్లు జమ అయ్యాయి. 2,858 మంది ఖాతాలో 4 పాయింట్లు, 8,809 మంది ఖాతాలో 3 పాయింట్లు, 40,521 మంది ఖాతాలో 2 పాయింట్లు, 2,55,566 మంది ఖాతాలోకి ఒక పాయింటు చొప్పున పోలీసులు ఇప్పటికే జమ చేశారు. 350 మంది ట్రాఫిక్ పోలీసులు ప్రతి రోజూ ఇలా వాహన ఉల్లంఘనదారుల ఖాతాలో పాయింట్లను జమ చేస్తున్నారు. 12 పాయింట్లు దాటి 13వ పాయింటు నమోదు అయిన వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. లైసెన్స్ రద్దయ్యాక వాహనం నడుపుతూ పట్టుబడితే జైలుకు పంపిస్తారు.

  • Loading...

More Telugu News