chennampalli kota: చెన్నంపల్లి కోటలో ఖనిజ సంపద.. గుర్తించిన అధికారులు!

  • కోటలో అపారమైన క్వార్ట్జ్, రెడ్ చిప్ గ్రానైట్ ఖనిజాలు
  • వెల్లడించిన ఆదోని ఆర్డీవో ఓబులేసు
  • బంగారం, వజ్రాలు ఉన్నాయని నమ్ముతున్న స్థానికులు

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం అన్వేషణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు జరిపిన తవ్వకాల్లో ఏనుగు దంతాలు, మూడు తలల నాగుపడగ, కొన్ని జంతువుల కళేబరాల అవశేషాలు మాత్రమే బయటపడ్డాయి. తాజాగా, మళ్లీ తవ్వకాలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆదోని ఆర్డీవో ఓబులేసు కీలక విషయాలను వెల్లడించారు.

 కోటలో రెడ్ చిప్ గ్రానైట్, క్వార్ట్జ్ వంటి విలువైన ఖనిజ సంపదను గుర్తించామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే మైనింగ్, రెవెన్యూ, గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో తవ్వకాలను చేపట్టామని చెప్పారు. మరోవైపు, కోటలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి బంగారం, వజ్రాలు ఉన్నాయని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. 

More Telugu News